23 kg సూట్‌కేస్ పజిల్: ఆన్సర్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ట్రిక్
ఆరు వస్తువులు, 35 kg, 23 kg బ్యాగ్. షార్ట్‌కట్స్ ఎందుకు ₹13,500 దగ్గర ఆగిపోతాయి, బెస్ట్ బ్యాగ్ ₹14,000 ఎలా సేవ్ చేస్తుంది, దాన్ని కనిపెట్టే డైనమిక్ ప్రోగ్రామింగ్ ట్రిక్, స్టెప్ బై స్టెప్.
Manvi Studios · · 9 min read
మన్వి స్టూడియోస్ షార్ట్‌లో ఒక పజిల్ అడిగాం. మీరు రేపు అమెరికా వెళ్తున్నారు. ఇంట్లో 35 kg సామాన్లు రెడీగా ఉన్నాయి, కానీ బ్యాగ్‌లో 23 kg మాత్రమే పడతాయి. ఒక్కో వస్తువు తీసుకెళ్తే అది అమెరికాలో కొనక్కర్లేదు, అంటే అంత డబ్బు సేవ్. మొత్తం సేవింగ్ ఎక్కువ రావాలంటే ఏవి పెట్టాలి? ఒక్కటే రూల్: వస్తువు మొత్తం పెట్టాలి, లేదా వదిలేయాలి. సగం కుక్కర్, సగం స్వీట్లు కుదరవు.
ముందు మీరే ట్రై చేయండి
ఒక్కో వస్తువు మీద ట్యాప్ చేసి బ్యాగ్‌లో పెట్టండి, మళ్లీ ట్యాప్ చేస్తే బయటకి. 23 kg దాటకుండా ఎంత సేవ్ చేయగలరు?
మూడు షార్ట్‌కట్స్, మూడూ మిస్
చాలా మంది ఒక రూల్ పెట్టుకుని సర్దుతారు: ఎక్కువ సేవ్ చేసేవి ముందు, లేదా కిలోకి ఎక్కువ సేవ్ చేసేవి ముందు, లేదా తేలికైనవి ముందు. ప్రతి రూల్ తన లిస్ట్‌లో వరుసగా వెళ్తుంది: పడితే పెడుతుంది, పడకపోతే వదిలేస్తుంది. ఇలాంటి రూల్‌ని గ్రీడీ (greedy) పద్ధతి అంటారు.
ఎందుకు మిస్ అవుతాయి? గ్రీడీ రూల్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి చూడదు. “కిలోకి” రూల్ ఆవకాయ, స్వీట్లు, స్టీల్, కుక్కర్ పెడుతుంది: 19 kg, ₹13,500. బ్యాగ్‌లో 4 kg ఖాళీ మిగిలిపోతుంది, ఖాళీ కిలో ఏమీ సేవ్ చేయదు. స్టీల్ (7 kg) తీసి టెక్స్ట్‌బుక్స్ (10 kg) పెడితే ఆ ఖాళీ నిండుతుంది, సేవింగ్ ₹500 పెరుగుతుంది.
ఆన్సర్: ₹14,000
22 kg · ₹14,000
ఆరు వస్తువులతో మొత్తం 64 రకాల బ్యాగ్‌లు సర్దొచ్చు. అన్నీ చెక్ చేస్తే, ₹14,000 వచ్చేది ఈ ఒక్క బ్యాగే; తర్వాత బెస్ట్ ₹13,500. ఇంకో విచిత్రం: ఈ బ్యాగ్ 22 kg మాత్రమే. 1 kg ఖాళీగా ఉన్నా ఇదే బెస్ట్, ఎందుకంటే 1 kg వస్తువు ఏదీ లేదు. “బ్యాగ్ ఫుల్ చేయాలి” అనేది కూడా ఒక షార్ట్‌కట్ మాత్రమే.
అన్ని బ్యాగ్‌లూ ట్రై చేస్తే?
ప్రతి వస్తువుకి రెండే ఆప్షన్లు: పెట్టడం, వదిలేయడం. అందుకే వస్తువు ఒక్కటి పెరిగితే బ్యాగ్‌ల సంఖ్య డబుల్ అవుతుంది. ఆరు వస్తువులకి 64, పేపర్ మీద చేయొచ్చు. కానీ 30 వస్తువులకి 107 కోట్లకి పైగా.
6 వస్తువులు
10 వస్తువులు
20 వస్తువులు
25 వస్తువులు
30 వస్తువులు
డైనమిక్ ప్రోగ్రామింగ్, ఐదేళ్ల పిల్లాడికి చెప్పినట్టు
పిల్లాడి స్లేట్ మీద 1 + 1 + 1 + 1 రాసి “ఎంత?” అంటే, లెక్కపెట్టి “4” అంటాడు. ఇంకో “+ 1” రాస్తే? వెంటనే “5”. మళ్లీ మొదటి నుంచి లెక్కపెట్టలేదు, పాత ఆన్సర్ గుర్తుపెట్టుకున్నాడు. చిన్న ప్రశ్నలకి ఆన్సర్లు రాసి పెట్టుకుని, పెద్ద ప్రశ్నకి వాటినే మళ్లీ వాడుకోవడం: ఇదే డైనమిక్ ప్రోగ్రామింగ్ (DP).
సూట్‌కేస్‌కి DP: చీటీల ర్యాక్
గోడ మీద ఒక ర్యాక్ ఊహించుకోండి: 1 kg, 2 kg, … 23 kg, ప్రతి బ్యాగ్ సైజ్‌కి ఒక అర. ప్రతి అరలో ఒక చీటీ: “ఈ సైజ్ బ్యాగ్‌కి, ఇప్పటిదాకా వచ్చిన వస్తువులతో, బెస్ట్ సేవింగ్”. మొదట్లో అన్ని చీటీలు ₹0. వస్తువులు ఒక్కొక్కటిగా వస్తాయి, ప్రతి అర ఒకటే ప్రశ్న అడుగుతుంది:
వదిలేస్తే: ఈ అర పాత చీటీ.
పెడితే: ఈ వస్తువు సేవింగ్ + (ఈ సైజ్ − వస్తువు బరువు) అర పాత చీటీ.
రెండిట్లో ఏది ఎక్కువైతే, అదే కొత్త చీటీ.
best[w] = max( best[w], saving + best[w − kg] )“పెడితే” లెక్కలో మళ్లీ ఏమీ లెక్కపెట్టం: మిగిలిన స్థలానికి బెస్ట్ ఆల్రెడీ ఒక అరలో రాసి ఉంది. అదే స్లేట్ ట్రిక్. కింద టేబుల్‌లో ఒక్కో లైన్ = ఒక వస్తువు వచ్చాక ర్యాక్. ఏ గడి మీదైనా ట్యాప్ చేస్తే, ఆ చీటీ ఎలా వచ్చిందో చూపిస్తుంది.
| అర (kg) → | 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ఏమీ లేవు | ||||||||||||||||||||||||
| + ఆవకాయ | ||||||||||||||||||||||||
| + స్వీట్లు | ||||||||||||||||||||||||
| + స్టీల్ గిన్నెలు | ||||||||||||||||||||||||
| + కుక్కర్ | ||||||||||||||||||||||||
| + టెక్స్ట్‌బుక్స్ |
23 kg అర, టెక్స్ట్‌బుక్స్ (10 kg, ₹4,500)
వదిలేస్తే: ₹13,500
పెడితే: ₹4,500 + 13 kg అర ₹9,500 = ₹14,000
కొత్త చీటీ: ₹14,000
టెక్స్ట్‌బుక్స్ వచ్చినప్పుడు
ఆవకాయ, స్వీట్లు, స్టీల్, కుక్కర్ వచ్చాక 23 kg అరలో ₹13,500 (షార్ట్‌కట్స్ ఆగిన చోటే). ఇప్పుడు టెక్స్ట్‌బుక్స్: 10 kg, ₹4,500. పెడితే మిగిలేది 13 kg; 13 kg అరలో ఆల్రెడీ ₹9,500 (ఆవకాయ + స్వీట్లు + కుక్కర్, 12 kg). 9,500 + 4,500 = ₹14,000, 13,500 కంటే ఎక్కువ. కొత్త చీటీ ₹14,000. చివర్లో బ్లాంకెట్లు వచ్చినా: 2,000 + 17 kg అర (₹11,500) = ₹13,500, తక్కువ. చీటీ మారదు.
ఏ వస్తువులు? వెనక్కి నడవండి
చీటీలో అంకె మాత్రమే ఉంది. వస్తువులు తెలియాలంటే చివరి లైన్ నుంచి పైకి వెళ్లండి: ఒక వస్తువు లైన్‌లో చీటీ మారితే, ఆ వస్తువు బ్యాగ్‌లో ఉంది; దాని బరువు తీసేసి పై లైన్‌లో ఆ అరకి వెళ్లండి. మారకపోతే, అది బయట.
- 23 kg అర, బ్లాంకెట్లు: మారలేదు → బయట
- 23 kg అర, టెక్స్ట్‌బుక్స్: మారింది → బ్యాగ్‌లో. 23 − 10 = 13 kg కి వెళ్లండి
- 13 kg అర, కుక్కర్: మారింది → బ్యాగ్‌లో. 13 − 5 = 8 kg కి వెళ్లండి
- 8 kg అర, స్టీల్ గిన్నెలు: మారలేదు → బయట
- 8 kg అర, స్వీట్లు: మారింది → బ్యాగ్‌లో. 8 − 3 = 5 kg కి వెళ్లండి
- 5 kg అర, ఆవకాయ: మారింది → బ్యాగ్‌లో. 5 − 4 = 1 kg కి వెళ్లండి
ఎన్ని చిన్న ప్రశ్నలు?
ప్రతి వస్తువుకి, ప్రతి అర ఒక్కసారి అడుగుతుంది: వస్తువులు × అరలు. 6 × 23 = 138 (ఆరు వస్తువులకి 64 బ్యాగ్‌లే, కాబట్టి ఇక్కడ పేపరే చాలు). కానీ 30 వస్తువులకి 30 × 23 = 690 ప్రశ్నలు, 107 కోట్ల బ్యాగ్‌లకి బదులు. ఒక చిన్న నోట్: ఈ లెక్క బరువులు పూర్తి కిలోల్లో ఉన్నాయి కాబట్టి. గ్రాముల్లో అయితే 23,000 అరలు కావాలి; కంప్యూటర్‌కి అది కూడా చిన్న పనే.
ఈ ట్రిక్ ఎక్కడ వాడతారు?
- రైల్వేస్, ఎయిర్‌లైన్స్, షిప్పింగ్: ఏ వ్యాగన్‌లో, ఏ ఫ్లైట్‌లో, ఏ కంటైనర్‌లో ఎంత సామాను ఎక్కించాలి. ఇది మన సూట్‌కేస్ పజిలే, పెద్ద సైజ్‌లో (DPతో పాటు ఇంకొన్ని పద్ధతులూ వాడతారు).
- DNA: రెండు జీన్స్ ఎంత మ్యాచ్ అవుతాయో చూసే “సీక్వెన్స్ అలైన్‌మెంట్” ఒక DP టేబుల్.
- స్పెల్ చెక్, ఆటోకరెక్ట్: “recieve” నుంచి “receive”కి ఎన్ని అక్షరాలు మార్చాలి? ఈ “ఎడిట్ డిస్టెన్స్” కూడా DP.
- మ్యాప్స్ రూట్స్: దగ్గర జంక్షన్ల బెస్ట్ రూట్స్ నుంచి పెద్ద రూట్ కట్టడం.
కోడ్ (Python)
పై ర్యాక్ అంతా ఈ కొన్ని లైన్లే. ఒకే లిస్ట్ వాడుతున్నాం కాబట్టి, బరువు పెద్ద అర నుంచి చిన్న అర వైపు వెళ్తాం: అలా ఒక్కో వస్తువు ఒక్కసారే పడుతుంది.
items = [("avakaya", 4, 5000), ("sweets", 3, 2000), ("steel", 7, 4000),
("cooker", 5, 2500), ("textbooks", 10, 4500), ("blankets", 6, 2000)]
CAP = 23
best = [0] * (CAP + 1) # one note per shelf, 0..23 kg
for name, kg, saving in items: # things arrive one at a time
for w in range(CAP, kg - 1, -1):
best[w] = max(best[w], saving + best[w - kg])
print(best[CAP]) # 14000ఈ పజిల్ వీడియోలు Manvi Studios YouTube ఛానెల్‌లో ఉన్నాయి: పార్ట్ 1 పజిల్, పార్ట్ 2 ఆన్సర్. బరువులు, సేవింగ్స్ పజిల్ కోసం ఉదాహరణ అంకెలు. ఎయిర్‌లైన్ 23 kgలో ఖాళీ సూట్‌కేస్ బరువు కూడా కలుస్తుంది.